calender_icon.png 3 April, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి బుద్ధి చెప్పాలి

25-03-2025 01:28:21 AM

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

నర్సాపూర్(మెదక్), మార్చి 24 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధులను, రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ అవమానపరుస్తుందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విమర్శించారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జై బాపు - జై భీం - జై సంవిధాన్ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి మైనంపల్లి హాజరై ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్గాంధీ ఈ కార్యక్రమం తీసుకువచ్చారని తెలిపారు. ఆదాని, అంబానీలాంటి కార్పోరేట్ శక్తుల చేతుల్లో దేశాన్ని పెట్టాలని బీజేపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.

బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తీసుకు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పార్టీ నర్సాపూర్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, మెదక్, నర్సాపూర్ నియోకవర్గాల ఇంచార్జిలు నూతి శ్రీకాంత్గౌడ్, మెట్టు సాయికుమార్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్గుప్తా, నాయకులు రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు అశోక్గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.