సీపీఎం నేతల డిమాండ్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లా నుండి బీజేపీకి ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలను ఇచ్చిన జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో ఒక్క రూపాయి ఇవ్వకుండా మరోసారి ప్రజలను మోసగించిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్, బండి దత్తత్రి, లంక రాగోలు అన్నారు. ప్రజలకు న్యాయం చేయని ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ సోమవారం ఆదిలాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల ముందు సీసీఐ, ఆదిలాబాద్ రైల్వే లైన్, విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చి బడ్జెట్ లో నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్యాబట్టారు. బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. దేశ అభివృద్ధికి శాపంగా ఉండనుందని, ప్రజల జీవితాలకు, శ్రామికుల బతుకుదెరువుకు శాపంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.