మెదక్ ఎంపీ రఘునందన్ రావు
దుబ్బాక (విజయక్రాంతి): ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో పర్యటించి మాట్లాడారు. హైడ్రా వెనక్కి తిరిగిన పక్కకు మలిగిన నీళ్ల ల్ల కట్టిన ఇండ్లను కూల్చివేయకున్నా హైడ్రా పనితీరుమీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుమీద ప్రజలకు అనుమానం వస్తుందన్నారు. నీళ్ల లో ఇండ్ల నిర్మాణం పూర్తి అయినా బ్యాంకు లోన్ పదేండ్ల నుంచి ఇండ్లలో ఉంటున్న వాటిని కులగొట్టి ఎఫ్ టీ ఎల్ బఫర్ జోన్ లు క్లియర్ చేయాలన్నారు.ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లలో ఇళ్లు కోల్పోయిన పేద ప్రజలకు కొకపేట లో 100గజాలు 200గజాలు ఇచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాటు చూపించాలన్నారు.
హైడ్రా ను హైద్రాబాద్ కే పరిమితం కాకుండా జిల్లాలు గ్రామాలకు విస్తరించాలన్నారు. అక్రమకట్టడాలు ఎవరివైనా కూల్చివేయాలన్నారు.హైడ్రా తన పని తిరును నిష్పక్షా పాతంగా కొనసాగించాలని అది చేత గాకుంటే రంగనాధ్ ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నారు. మల్లన్న సాగర్ కాలువ నిర్మాణం లో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామం లో 400మంది రైతులు ఉరి వైపు నుంచి పొలాల వైపు వెళ్ళడానికి బ్రిడ్జి కావాలని అడిగరాని, వెంటనే డి ఈతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని తెలిపారు. దాతల మరియు ప్రభుత్వ సహాయం తో వచ్చిన వాటితోవేణుగోపాల ఆవరణలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామస్తులు పార్టీలకు అతీతంగా సహకరించి పూర్తి చేసుకోవాలని సూచించారు.
కౌన్సిలర్ ను పరామర్శించిన ఎంపీ
చెల్లాపూర్ గ్రామం లో గోనెపల్లి సంజీవరెడ్డి తండ్రి ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న ఎంపీ వారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమం లో 3వార్డ్ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, సుంకు ప్రవీణ్, తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు