calender_icon.png 12 January, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్ ఆవరణలో గందరగోళం.. బీజేపీ ఎంపీకి గాయాలు

19-12-2024 11:28:43 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల పోటాపోటీ నిరసనలు నెలకొన్నాయి. ఇరు పక్షాల నిరసనలతో పార్లమెంట్ ప్రాంగణం హోరెత్తింది. అంబేద్కర్ ను అవమానించారంటూ పరస్పర విమర్శలు చేస్తున్నారు. పార్లమెంట్ లోపలికి వెళ్తున్న ఎంపీలను విపక్షాలు అడ్డుకున్నాయి. ఎంపీలను అడ్డుకున్న సందర్భంగా ఒడిశా ఎంపీకి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ నెట్టారని అధికార పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. స్పల్పగాయమైన ఎంపీని సహచర ఎంపీలు ఆస్పత్రికి తరలించారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ.. తనపై పడిన ఎంపీని రాహుల్ గాంధీ నెట్టడంతో తాను కిందపడ్డానని తెలిపారు. తాను మెట్ల దగ్గర నిలబడి ఉండగా రాహుల్ గాంధీ వచ్చి తనపై పడిన ఎంపీని తోసేశాడని చంద్ర సారంగి ఆరోపించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను పార్లమెంటు ప్రవేశద్వారం గుండా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాను. బిజెపి ఎంపీలు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నన్ను నెట్టివేశారని చెప్పారు. బీజేపీ ఎంపీలు మమ్మల్ని లోపలికి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు అంబేద్కర్ జీ స్మృతిని అవమానించారని రాహల్ గాంధీ ఆరోపించారు. పోటాపోటీ నిరసనల మధ్య లోక్ సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.