calender_icon.png 4 March, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును స్థిరాస్తి వ్యాపారం కోసం చేస్తున్నారా?

04-03-2025 01:01:48 PM

కేసీఆర్ కు పట్టినగతే రేవంత్ రెడ్డికి పడుతుంది

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ ఓటమికి నాంది

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్(Regional Ring Road) భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలు అస్థిత్వాన్ని కోల్పోతాయని బీజేపీ సీనియర్ నేత ఎంపీ కె. లక్ష్మణ్(BJP MP Laxman) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా తెలిపారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును స్థిరాస్తి వ్యాపారం కోసం చేస్తున్నారా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. లోపభూయిష్టంగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేశారని చెప్పారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు(RRR project) సంబంధించి ఇంతవరకు భూసేకరణ చేయలేదని ఆయన ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్(RRR Alignment) మార్చాలని ఇప్పటికే ప్రజలు విన్నవించారని ఆయన వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం అధికంగా సాయం చేస్తోందన్నారు. ఆరు గ్యారంటీలపై మంత్రులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ విషయంలో కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కు పట్టినగతే రేవంత్ రెడ్డి(Anumula Revanth Reddy)కి పడుతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. మాయమాటలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ఉత్తర తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Teacher MLC elections) బీజేపీ అభ్యర్థి గెలిచారు. తొలి ప్రాధన్యత ఓట్లతోనే బీజేపీ బలపరిచిన అభ్యర్థి కొమరయ్య(Malka Komaraiah) విజయం సాధించారని లక్ష్మణ్ వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ ఓటమికి నాంది అని లక్ష్మణ్ చమత్కరించారు.