24-02-2025 12:50:51 PM
అనుభవం లేని కొత్త సీఎం.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు
రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: అనుభం లేని కొత్త సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ రాష్ట్రాన్ని మరిత అప్పుల ఊబిలోకి నెట్టారని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ కె. లక్ష్మణ్(BJP MP Laxman ) ఆరోపించారు. నల్గొండ జిల్లాలో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... రిటైర్ అయిన రోజే ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్(Retired employees Benefits) ఇవ్వలేని స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఒక ఉద్యోగి కోర్టును ఆశ్రయించి తన బెనిఫిట్స్ పొందాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శించారు. గత సీఎం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి చేతికి చిప్ప ఇచ్చారని ఎద్దేవా చేశారు. సరైన వైద్య సేవలు అందట్లేదని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు డీఏలను పెండింగ్ లో పెట్టిందన్నారు. ఐదేళ్లకోసారి పీఆర్ సీ అమలు చేయాల్సిఉంటే.. దాన్ని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఆస్పత్రులు పట్టించుకోవట్లేదని వెల్లడించారు. ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.