07-03-2025 01:52:43 PM
హైదరాబాద్: ఏప్రిల్ లోపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక(BJP National President Election) పూర్తి అవుతోందని ఎంపీ కె. లక్ష్మణ్(BJP MP Laxman) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తవిస్తూ బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) అనేది గత చరిత్ర అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ(Bharatiya Janata Party) ఎదిగిందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను పోటీలో పెట్టిన ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగిన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ(Telangana MLC polls) స్థానాల్లో రెండింటిని బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో విజయం సాధించిన అభ్యర్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా సీనియర్ పార్టీ నాయకత్వం నుండి ప్రశంసలు పొందారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో అంజిరెడ్డి 5,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలిచారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తరపున టి. జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గాన్ని మల్కా కొమరయ్య(Malka Komaraiah) గెలుచుకున్న విషయం తెలిసిందే.