హైదరాబాద్: హైడ్రా చర్యలతో అనేక మంది ఆందోళన చెందుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో ఎక్కువ ఇళ్లు ఇవ్వాలన్నామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో అనేక చెరువులు మాయం అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కువమందికి రెండుగదుల ఇళ్లు ఇవ్వాలని కోరామన్నారు. చెరువులను విస్తరించి సుందరీకరణ పనులు చేపట్టాలని కోరామన్నారు. హైదరాబాద్ లోని నాలాల విస్తరణకు, స్వచ్ఛభారత్ ద్వారా నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఈటల పేర్కొన్నారు. తెలంగాణకు అన్ని విధాలుగా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సీఎస్ఎస్ కు రాష్ట్రం 40 శాతం నిధులు జమ చేయాలని సూచించారు. ఎఫ్ఆర్ బీఎం రుణాలు 50 శాతం దాటాయని ఆయన చెప్పారు.