న్యూఢిల్లీ: మల్కాజిగిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌యూబీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేనట్లుఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే ఆర్‌యూబీలు నిర్మించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మెట్రోను 16 రాష్ట్రాలకు విస్తరించామని ఎంపీ ఈటల పేర్కొన్నారు.