calender_icon.png 22 January, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెంపదెబ్బపై ఈటల రియాక్షన్.. అందుకే కొట్టిన..!

22-01-2025 01:57:01 PM

హైదరాబాద్: హైడ్రా, మూసీ బాధితులకు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Partyఅండగా ఉంటుందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. పేదల భూములను బడా బాబులు లాక్కుంటే కాపాడరా? అని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా(Medchal District) కొర్రెములలో పేదల భూములు రియల్టర్లు లాక్కుంటున్నారని చెప్పారు. మా మీద పైనుంచి ఒత్తిడి ఉందని అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. అధికారులపై ఎవరి ఒత్తిడి ఉందో భయటపెట్టాలని ఈటల డిమాండ్ చేశారు. పేదల కాలనీలు నేలమట్టం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్(Etela Rajender) ఆగ్రహం వ్యక్త ం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదలకు రక్షణ లేదా? అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నోసార్లు రాచకొండ సీపీ, కలెక్టర్ కి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ''నేను ఎవరినీ కొట్టాలని అనుకోలేదు.. పేదల బాధ చూసి ఆవేశం వచ్చింది'' అని స్పష్టం చేశారు. ఈ విషయంలో DOPTకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తాను కసులకు భయపడనని వెల్లడించారు.

ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri BJP MP Etela Rajender) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడో 40, 50 ఏళ్ల క్రితం వాటికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చారని ఈటల వివరించారు. తమ పార్టీ నేతలు అనేక భవనాలను కూల్చకుండా కాపాడారని వెల్లడించారు. హైడ్రా(Hydra demolition) పేరుతో మూడు నెలలపాటు నానా హడావిడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా హడావిడి ముగిశాక మూసీ నది(Musi River) పరిధిలోని ఇళ్లపై పడ్డారని విమర్శించారు. మూసీ బాధితుల నుంచి తమకు నిత్యం విజ్ఞప్తులు వచ్చాయని సూచించారు. స్థిరాస్తి వ్యాపారం పేరుతో భూములు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఈటల మండిపడ్డారు. కబ్జాకాండపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ 

మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌(Real Estate Broker) చెంప చెళ్లుమనిపించారు. పేదలకు చెందిన భూములను దళారీ ఆక్రమించాడన్న ఆరోపణలతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్‌లో ఎంపీ పర్యటించగా, పేదల భూములను ఓ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పేదల భూములు ఆక్రమణకు గురికావడంపై ఆగ్రహించిన రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఎంపీ అనుచరులు, బాధితులు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై కూడా దాడి చేశారు.

ఇదిలా ఉండగా రద్దు చేసిన ఏకశిల వెంచర్‌లో నిజమైన బ్రోకర్లు ప్లాట్లను అమాయకులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ ఈటెల బ్రోకర్లపై దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో(Social Media Viral) వైరల్‌గా మారింది. పేదలపై దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదన్న ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులను జైల్లో పెట్టాలని ఈటల డిమాండ్ చేశారు. సీపీకి బ్రోకర్లను కలిసే టైమ్ ఉంటుంది.. కానీ, తమని కలవడానికి మాత్రం ఉండదని ఈటల విమర్శించారు.  పోచారం(pocharam) వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టినట్లు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్‌పై ఫిర్యాదు నమోదైంది.