హైదరాబాద్,(విజయక్రాంతి): మల్కాజ్‌గిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోచారం పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ ఎంపీ ఈటల హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల, ఏకశిలానగర్‌లో ఈటల స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. వాచ్ మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోచారం పోలీసులు ఎంపీపై దాడి, తప్పుడు నిర్బంధం వంటి ఇతర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. బీజేపీ ఎంపీ పిటిషన్ పై సమగ్రవిచారణ జరపాలని పోలీసులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.