05-04-2025 03:13:50 PM
హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy Government) అలవి గాని హామీలిచ్చి ఈ రోజు చతికిలిపడిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etela Rajender) అన్నారు. కడుపుకట్టుకుని, నోరుకట్టుకుని హామీలు అమలు చేస్తామని చెప్పి, 80 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. అనాలోచిత హామీలిచ్చి ప్రభుత్వ భూములే కాకుండా, హెచ్‌సీయూ( Hyderabad Central University land issue) వంటి విద్యాలయాలను, అందులోని వృక్ష, జంతు సంపదను నాశనం చేసి, అమ్ముకుంటానంటే ఎవరూ ఊరుకుంటారు? అని ఈటల ప్రశ్నించారు. పార్కులు సైతం ఆక్రమణకు గురవుతున్నాయి. భూములమ్మడం కాదు గొప్ప గొప్ప పరిశ్రమలు నెలకొల్పండి, మంచి ఇన్‌స్టిట్యూషన్స్ పెట్టండి, ఉపాధి కల్పన చేయండి, అంతేకాని భూములమ్ముతరా..? విశ్వవిద్యాలయ భూములు అమ్మి విద్యార్థులకు భవితను, చదువును దూరం చేయొద్దని ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
సుచిత్ర స్టేషన్ మిలిటిరీ లైన్(Suchitra Station Military Line)ను ఆనుకునే ఉంటుంది. అందువల్ల అది నిరూపయోగంగా ఉందని ఆయన పేర్కొన్నారు. లక్షల మందికి ఉపయోగపడే ఆ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌ను చిక్కులు తొలగించాల్సిందిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో మాట్లాడగా, సానుకూలంగా స్పందిచారని చెప్పారు. అలాగే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో అనేక రైల్వే లైన్లు జిగ్‌జాక్‌గా ఉంటాయని, అయితే పదిహేను ఏళ్లుగా వాటికి అండర్‌పాస్‌లు, ఓవర్ బ్రిడ్జీలు లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యపై కూడా చర్చించామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మల్కాజిగిరిలో డ్రైనేజీ వ్యవస్థ(Malkajgiri Drainage system), మంచి నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని ఈటల ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో జలశక్తి మిషన్ ద్వారా మంచినీటి సరఫరాకు, డ్రైనేజీ వ్యవస్థకై, రూ. 133 కోట్ల అందిస్తున్నామని తెలిపారు. ఆ నిధులను సంపూర్ణంగా వినియోగించాల్సిందిగా కోరుతున్నామన్నారు. మల్కాజిగిరిలో ఇతర మౌలిక సదుపాయాలకై కూడా స్వచ్చ్ భారత్ కింద మరిన్ని నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్న ఈటల రాజేందర్ ఇప్పటికే స్మార్ట్ సిటీ, అమృత్ భారత్ స్టేషన్ పథకాల(Amrit Bharat Station Scheme)తో అవసరమైన నిధులు సమకూరుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటెల సూచించారు.