calender_icon.png 23 December, 2024 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన డీకే అరుణ

23-12-2024 03:40:59 PM

హైదరాబాద్,(విజయక్రాంత్రి): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతులు చేసిన దాడిని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఖండించారు. దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారని ఆరోపించారు. నిందితుల్లో ఒకరు కాంగ్రెస్ జడ్పీటిసీగా పోటీ చేసిన వ్యక్తి అని డీకే అరుణ తెలిపారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని అనుమానం కలుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. లగచర్ల ఘటనలో జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలైన రైతులను పరామర్శించేందుకు డీకే అరుణ వెళ్లారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారాడన్నారు. అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మార్చిపోయానని అనడాన్ని కేటీఆర్ ట్రోల్ చేయడంతోనే ముఖ్యమంత్రి బన్నిని టార్గెట్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్య ఉన్న వైరాన్ని సినిమా వాళ్లపై చూపించోద్దని రేవంత్ రెడ్డి ఉద్దేశించి డీకే అరుణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని వివర్శించారు.