హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఎంపీ ఆర్వింద్.. ఈనెల 7న కాంగ్రెస్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు, తన తండ్రి అయిన డీ.శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీఎస్ ఇటీవలె మరణించిన విషయం తెలిసిందే.