calender_icon.png 25 February, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి

24-02-2025 09:27:21 PM

అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్..

లక్షేట్టిపేట (విజయక్రాంతి): ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. సోమవారం మున్సిపాలిటీలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.... బీజేపీ అభ్యర్థి ని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక పబ్బం గడుపుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే పట్టభద్రులను నిండా ముంచడం జరుగుతుందని జోష్యం చెప్పారు.

ఆల్ఫోర్స్ కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికే నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నాడని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మాట్లాడుతూ.... మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కోసం తన జీతాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. పట్టబదుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. పట్టభద్రులందరూ బీజేపీ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి బీజెపి  ‌కార్యకర్తలు, నాయకులు  గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, గోమాస శ్రీనివాస్, మాజీ బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎర్రబెల్లి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రజనీష్ జైన్, మున్నా రాజ్ సిసోడియా, బిజెపి పట్టణ అధ్యక్షుడు హరి గోపాల్, ఉపాధ్యక్షులు హేమంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ముత్తె సత్తన్న, బిజెపి నాయకులు, కార్యకర్తలు, పట్టబద్రులు, తదితరులు పాల్గొన్నారు.