calender_icon.png 13 March, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత పార్టీ నేతలపై.. రాజాసింగ్ సంచలన కామెంట్స్

13-03-2025 12:59:22 PM

సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా?

వాళ్లకు రిటైర్ మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచిరోజులు

బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను బయట పడేయాలే

తెలంగాణ హిందూమతం సేఫ్ గా ఉండాలంటే బీజేపీ రావాలి

హైదరాబాద్: సొంత పార్టీ నేతలపై భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Raja Singh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హిందూమతం సురక్షితంగా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం అవసరమని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ(Bharatiya Janata Party) ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికి వెళ్లి పోవాలని సూచించారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా సమావేశమవుతున్నారని రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రహస్య సమావేశాలు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ అంశంపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలని రాజాసింగ్ కోరారు. గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్ మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని ఆయన తేల్చిచెప్పారు. నేనొక్కణ్నే కాదు.. ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్తలు కోరుకుంటున్నారని రాజాసింగ్ తెలిపారు.