calender_icon.png 22 April, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రులతో బీజేపీ ఎమ్మెల్యే దోస్తీ

22-04-2025 12:47:55 AM

భూ కబ్జాల్లో నంబర్ వన్.. ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

కాంగ్రెస్ నేత కంది ఆరోపణ

ఆదిలాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): కబ్జాలకు పాల్పడుతూ స్థానిక ఎమ్మెల్యే  పాయల్ శంకర్ ల్యాండ్ మాఫియాను పెంచి పోషిస్తున్నాడని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఎక్కడ తన అవినీతి అక్ర మాల బాగోతం బయట పడుతుందోనన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రు లతో దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అనుకోని నడ వండి అని నిస్సిగ్గుగా వారితో మాట్లాడారని స్వయానా ఒకరిద్దరు మంత్రులే ఈ విషయాన్ని తనకు చెప్పినట్టు వివరించారు.

సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కంది శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడు తూ... ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జా చేస్తూ పేద ల నోట్లో మట్టికొడుతున్నాడని మండి పడ్డారు. అంతే కాకుండా తన అక్రమాలకు అడ్డు వచ్చేవారిపై , అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులు చేయించారని ఆరోపించారు. భూ కబ్జా దారుల్లో నంబర్ వన్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అని అన్నా రు.

అతని ఆర్థిక రాజకీయ ఎదగుదలకోసం ఎవరి జీవితాన్నైనా ఫణంగా పెట్టడానికి సిద్దంగా ఉంటారన్నారు. చివరికి ఏమీ తెలియని ఆవేశ పరుడైన తన కుమారుడిని సైతం ఎమ్మెల్యే ఉసిగొల్పి దాడులకు ప్రేరే పిస్తారని అన్నారు. తను చెబుతున్నది నిజ మని, కాదని ఎమ్మెల్యే ప్రమాణం చేస్తరా అని సవాల్ విసిరారు. ఈ సమావేశం లో జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, గుడిపల్లి నగేష్, జహీర్ రంజాని, కలాల శ్రీనివాస్, బండారి సతీష్, సంద నర్సింగ్,  రామ్ కుమార్, ఆవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.