హైదరాబాద్: కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సమయం వృథా చేస్తోందని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. రైతులను ఆదుకునే చర్యలు మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదని విమర్శించారు. కౌలు రైతులకు రైతుభరోసా, రైతు కూలీలకు రూ. 12 వేలు, 15 లక్షల మంది రైతుకూలీలకు రూ.900 కోట్లు, డిసెంబర్ 28 నాటికే ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. రైతుభరోసా(Rythu Bharosa)పై సబ్ కమిటీ వేసి 5 నెలలు గడిచినా.. విధివిధానాలు ఖరారు చేయలేదని మండిపడ్డారు. వానాకాలం సీజన్ రైతుభరోసాను ఎప్పటిలోపు ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం(Dr. B.R. Ambedkar Telangana State Secretariat)లో రైతు భరోసా విధి విధానాల పైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన విషయం తెలిసిందే.