కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ఎల్బీనగర్, సెప్టెంబర్ 12: దేశ రక్షణే బీజేపీ ధ్యేయమని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ఎదుట నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులకు బీజేపీ సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడు తూ.. దేశ రక్షణ కోసం ప్రజలు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు.
రాజేంద్రనగర్: శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ గ్రామంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.