నిర్మల్,(విజయక్రాంతి): బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు భూమయ్య అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. పార్టీ నిర్దేశించిన లక్ష్యం ఇప్పటివరకు సాధించిన సభ్యత్వ నమోదు తదితర అంశాలపై మండలాల వారిగా పార్టీ నాయకులను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు ఈ ప్రక్రియను ఈ నెలాఖరి వరకు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావాల రమణ రాజేశ్వర్ రెడ్డి సాధన అరవింద్ తదితరులు పాల్గొన్నారు