calender_icon.png 23 December, 2024 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం బీజేపీ

16-09-2024 12:21:34 PM

మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల విజయక్రాంతి : దేశ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం బీజేపీ అని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి సభ్యత్వం తీసుకునెందుకు ముందుకు వస్తున్నారని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సోమవారం హాజీపూర్ మండలం చిన్న గోపాల్ పూర్ గ్రామంలో చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని గ్రామస్థులకు బీజేపీ సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు.

గత పది సంవత్సరాల పాలనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, త్రాగు నీరు, నిరంతర విద్యుత్, డ్రైనేజీలు నిర్మించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన లో మోదీ ప్రభుత్వం ముందుంది అన్నారు. అదే విధంగా రైతులకు కిసాన్ సమ్మన్ నిధి, రైతులు పంట నష్ట పోతే ఫసల్ భీమా యోజన, ఉచిత రేషన్ బియ్యం, జన్ ధన్ ఖాతాలు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానిదే అని తెలిపారు. బీజేపీ సభ్యత్వానికి విశేష స్పందన లభిస్తుంది అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎనగందుల కృష్ణ మూర్తి, మడిపెల్లి సత్యం, పెండ్రం రాజ్ కుమార్, కనుకుంట్ల మనోజ్, కరిడే మధుకర్, మాణిక్ రావు తతిదరులు పాల్గొన్నారు.