calender_icon.png 15 October, 2024 | 7:57 PM

బాలాజీనగర్ లో బీజేపీ సభ్యత్వ నమోదు

15-10-2024 05:15:03 PM

కోదాడ (విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ 7, 8 వార్డులలో బీజేపీ ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు బర్మావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పలు కార్యక్రమాలు చేపట్టారన్నారు. గిరిజనులంతా బీజేపీకి మద్దతుగా ఉండాలని కోరారు. బీజేపీ నాయకులు, ముఖ్యఅతిథి రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి అనూష, జిల్లా హిందువాణి అధ్యక్షురాలు బి సీత, బిజెపి టౌన్ అధ్యక్షులు సాతులూరు హనుమంతరావు, సీనియర్ నాయకులు నూనె సులోచన, కో కన్వీనర్ బొలిశెట్టి కృష్ణయ్య, నాయకులు జల్లా జనార్ధన్, బి రాములు నాయక్, భాగ్యరాజు గౌడ్, సాయి శర్మ పాల్గొన్నారు.