calender_icon.png 23 January, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు

07-09-2024 01:16:35 AM

  1. హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
  2. రెగ్యులర్ అధ్యక్షుడి నియామకం ఎప్పుడు?

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ బీజేపీ ప్రారంభించనుంది. సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో 8వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్రమం ఉంటుందని పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 3వ తేదీనే   సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాల్సి ఉన్నా... రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా వాయిదా వేశారు. రాష్ట్రంలో 72 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేశారు. శుక్రవారం ముఖ్య నేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశమయ్యారు.

సభ్యత్వ నమోదుపై సూచనలు చేశారు. మరోవైపు పా ర్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో తలమునకలై ఉన్నారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. అయితే పార్టీ అధ్య క్షుడే అతిథి మాదిరిగా కార్యక్రమాలకు హాజరవ్వడం పట్ల పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కొత్త అధ్యక్షుని నియామకంలో జాతీయ పార్టీ నిర్లక్ష్యపు వైఖరి వల్ల తెలంగాణలో పార్టీకి నష్టం వాటిల్లుతోందనే చర్చ జరుగుతోంది. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్ని నియమించింది

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అధ్యక్షున్ని నియమించింది. అయితే బీజేపీ మాత్రం ఇంకా అధ్యక్ష నియా మకంలో మీనమేషాలు లెక్కిస్తోంది. అదిగో ఇదిగో అంటూ అధ్యక్ష నియామకం ఆలస్యం చేయడం వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం వాటిల్లుతోందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రేపటి నుంచి రాష్ట్రంలో బీజేపీ అత్యంత కీలకమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుండగా కనీసం కొత్త అధ్యక్షున్ని నియమించడంలో ఎందు కు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు సాధించి సత్తా చాటిన పార్టీకి రెగ్యులర్ అధ్యక్షుడు లేకపోవడం పట్ల పార్టీలోనే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అధ్యక్ష బాధ్యతలు తాను నిర్వహించలేనని ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి పేర్కొన్నా... ఇంకా కొత్త అధ్యక్షుని నియామకంలో పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతున్న విషయమేంటో అర్థం కావడం లేద ని పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకున్ని అధ్యక్షునిగా నియమించిన నేపథ్యంలో బీజేపీ కూడా అదే స్టాం డ్ తీసుకుని త్వరలోనే నూతన అధ్యక్షున్ని నియమిస్తుందని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.