calender_icon.png 15 January, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయించండి

31-08-2024 03:39:36 PM

బీజేపీ సభ్యత్వం కావాలంటే 8800002024 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ చైతన్యపురిలోని బీజేపీ జిల్లా కార్యాలయా నికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ‘నా బూత్ నా కార్యశాల సభ్యత్వ నమోదు (174 పోలింగ్ బూత్)’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పోలింగ్ బూత్ ల పరిధితలో అత్యధికంగా పార్టీ సభ్యత్వం నమోదు చేయించేలా క్రుషి చేయాలని కోరారు.   బీజేపీ సభ్యత్వం కావాలనుకునే వాళ్లంతా వెంటనే 8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. కరీంనగర్ జిల్లాలోని కార్మిక సంఘాలు, కుల సంఘాలు, వ్యాపార, వ్రుత్తి సంఘాలతోపాటు వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రతి ఒక్కరినీ కలిసి బీజేపీ సభ్యత్వం తీసుకునేలా క్రుషి చేయాలి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్, కొలగాని శ్రీనివాష్, ఎర్రం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.