- ఈ నెల 25 వరకు స్వీకరణ
- మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : రాష్ర్టంలో ఇప్పటి వరకు 40 లక్షల సభ్యత్వాలు నమోదైనట్లు బీజేపీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇం చార్జి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రా వు తెలిపారు. ఇందులో నేరుగా చేసిన సభ్యత్వాలు 35 లక్షలు కాగా.. మిగతా 5 లక్షల సభ్యత్వాలు మిస్డ్‌కాల్ ద్వారా వచ్చాయన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడి యాతో మాట్లాడారు. నవంబర్ 25 వరకు 45 లక్షల నుంచి 50 లక్షల స భ్యత్వాలు స్వీకరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా మెంబర్ షిప్ స్వీకరిస్తామని తెలిపారు. సంస్థాగత ఎన్నికల కమిటీల ఏర్పాటు, నామినేషన్ల స్వీకరణ, తదితర అంశాల దృష్ట్యా యాక్టివ్ మెంబర్ షిప్ టీమ్, రిటర్నింగ్ ఆఫీసర్స్ టీమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రిటర్నింగ్ ఆఫీసర్‌గాఎండల లక్ష్మీనారాయణ, యాక్టివ్ మెంబర్‌షిప్ టీమ్‌లో ధర్మారావు, వీరేందర్‌గౌడ్ ఉన్నారన్నారు. నవంబర్ 25 తర్వాత సంస్థాగత ఎన్నికల పర్వం మొదలవుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ర్ట కార్యదర్శి కొల్లి మాధవి, రాష్ర్ట అధికార ప్రతినిధి కట్ట సుధాకర్, కార్యవర్గ సభ్యులు బసవ లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు.