హాజరుకానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్లు
ఎల్బీనగర్: కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 అబద్ధాలు... 66 మోసాలు పేరిట శనివారం సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు . ఏర్పాట్లు పరిశీలించిన వారిలో బీజేపీ నాయకులు గుజుల ప్రేమెందేర్ రెడ్డి, కాసం వెంకటేష్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.