calender_icon.png 18 January, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల

17-01-2025 05:25:21 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా బీజేపీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం విడుదల చేశారు. సంకల్ప పాత్ర-1 విడుదల చేసిన బీజేపీ పార్టీ మహిళా సమృద్ధి యోజన పేరుతో మహిళలకు ప్రతినెలా రూ.2500, గర్భిణీ స్త్రీలకు రూ.21000 ఆర్థిక సహాయం, ఆరు పోషకాహార కిట్లు, మొదటి బిడ్డకు రూ.5,000, రెండవ బిడ్డకు రూ.6,000 ఇస్తామని హామీ ఇచ్చారు. 2021లో మహిళలకు రూ.1,000 ఇస్తామని ఆప్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పంజాబ్‌, ఢిల్లీలో పార్టీ తన వాగ్దానాలను నెరవేర్చలేదని జేపీ నడ్డా ఆరోపించారు. ప్రభుత్వం పేద మహిళలకు గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీని కూడా అందిస్తుందని, దీపావళి, హోలీ పండుగలకు కూడా రెండు ఉచిత సిలిండర్లు అందుతాయని బీజేపీ అధ్యక్షుడు అన్నారు.

ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని నడ్డా పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజ్ లభిస్తుందని, మ్యానిఫెస్టో ప్రకారం వృద్ధులకు ఇచ్చే మొత్తం ఆరోగ్య కవరేజీని రూ. 10 లక్షలకు పెంచుతుంది. సీనియర్ సిటిజన్లు 60-70 ఏళ్ల వయస్సులో రూ.2,000-2,500, 70 ఏళ్లు పైబడిన వారికి రూ.3,000 పొందే పెన్షన్ పథకాన్ని కూడా ఆయన ప్రకటించారు. దివ్యాంగులు, వితంతువులకు సహాయం రూ.3,000కి పెంచబడుతుందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ప్రతి మురికివాడలో అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, అక్కడ కేవలం రూ.5కే పూర్తి భోజనం పొందవచ్చని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలోని ఆప్ మొహల్లా క్లికిక్ లు అవినీతి నిలయాలని, అందులో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని ఆరోపణాలపై దర్యాప్తు చేసి, ప్రమేయం ఉన్నవారిని జైలులో పెడతామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.