12-04-2025 05:33:33 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడి సెంటర్లో బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టి పాఠశాల ఆవరణలోని చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించారు. బీజేపీ ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గావ్ చలో కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టి వారి సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
గ్రామాలభివృద్ధికి, రహదారుల అభివృద్ధికి పెద్ద పీట వేసిందన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గావ్ చలో జిల్లా కో కన్వీనర్ దేవరనేని సంజీవరావు, బీజేపీ మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్, మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు శివకృష్ణ, వంశీ గౌడ్, పెంచాల రంజిత్, మాజీ ఉపసర్పంచ్ సలేంద్ర శ్రీనివాస్, దారవేణి రవి కుమార్, కర్రె రాజయ్య, మాజీ ఎంపిటిసి సిద్ధన లచ్చన్న, రాజేష్ నాయక్, భానోత్ శీను, లచ్చన్న, గంజి రాజేష్, జుమ్మిడి దిలీప్, నామసాని శేఖర్, సిద్ధం శ్రీనివాస్, దుర్గం రాజయ్య, దుర్గం శ్యామ్, ఐదల మారుతి, కుడిమడుగుల రమేష్ లు పాల్గొన్నారు.