05-03-2025 08:41:47 AM
హైదరాబాద్: కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్(Graduate MLC election counting) హోరాహోరీగా కొనసాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,110 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి( BJP Candidate Anji Reddy)కి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,23,343 ఓట్లు చెల్లిన ఓట్లు, కాగా 28,686 చెల్లని ఓట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటా నిర్ధరణ ఓట్లు 1,11,672. మొదటి ప్రధాన్యత ఓట్లలో ఫలితం తేలక రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు.