03-04-2025 12:21:57 AM
కడ్తాల్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హెచ్‌సీయూ భూముల వేలం నిలిపి వేయాలని బిజెవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కాంటేకర్ భగీరథ్ ఆధ్వర్యంలో బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలో తహశీల్ధార్ ముంతాజ్ బేగం కి వినతిపత్రం అందజేశారు.
ఈ విషయమై బిజెవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి భగీరథ్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు రేవంత్ రెడ్డి సర్కార్ ఖబ్జా చేసి అమ్ముటకు నిర్ణయించిందని, భారీ ఎత్తున జెసిబి లు ట్రాక్టర్ లను ఇంకా చదును చేసే మిషన్ లను మొహరించింది యూనివర్సిటీ అటవీ ప్రాంతాన్ని చదును చేసే క్రమంలో జెసిబి ల వలన జింకలు ఇంకా అటవీ జంతువులు మొదలగునవి యూనివర్సిటీ లోని మూగజీవాలు జింకలు.నెమళ్ళు.
కుందేళ్లు ఇంకా అడవి పక్షులు జంతువులు చనిపోవడం జరుగుతుందని ఇట్టి విషయమై న్యాయ పోరాటం చేస్తున్న బిజెపి, బిజెవైఎం కార్యకర్తలను మరియు విద్యార్థులను విచక్షణా రహితంగా లాఠీఛార్జ్ చేసి కొడుతూ అక్రమ కేసులు పెడుతున్నారు. వెంటనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ భూములు వేలం వేయడం నిలిపి వేయాలి ఇంకా వన్య ప్రణుల చావుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలి మరియు రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీ లకు మరియు కళాశాల పాఠశాలల మరియు ప్రభుత్వ ఆస్తులకు శాశ్వత రక్షణ కల్పించాలన్నారు.
లేని పక్షంలో రాష్ట్ర ప్రజలు విద్యార్థులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూముల అమ్మకాలు నిలిపివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కడ్తాల్ మండల అధ్యక్షులు దోనాదుల మహేష్, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి లాల్, జిల్లా కౌన్సిలర్ మెంబెర్ శ్రీశైలం గౌడ్. బిజెపి సీనియర్ నాయకులు మాన్య నాయక్, జంగం వెంకటేష్, రాందాస్, రెడ్యా నాయక్, శంకర్ నాయక్, బిజెవైఎం మండల ఉపాధ్యక్షులు సురేష్, మధు, కళ్యాణ్. పవణ్ సాయి శ్రీకాం త్.మరియు బీజేపీ నాయకులు పొగాకు వెంకటేష్ మాల్య. బోల్గం నరేశ్, పాల్గొన్నారు.