దేశ సమగ్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఎంపీ డీకే అరుణమ్మ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన బిజెపి నేతలు
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి.పద్మాజా రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేసే విధంగా ఉందనీ, కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి.పద్మాజ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఎంపీ డీకే అరుణమ్మ చిత్రపటాలకు బీజేపీ నేతలు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో క్షీరాభిషేకం చేశారు. ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన ఇన్కమ్ టాక్స్ చెల్లించే వారికి ఈ బడ్జెట్లో వెసులుబాటు చేస్తుందన్నారు. ఏడాదికి 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఆదాయ పన్ను మినహాయింపు కల్పించింది. రైతులను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఆదుకునేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు రుణం పొందే అవకాశం కల్పించిందని పేర్కొన్నారు.
విద్య, వైద్యాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి జిల్లాకు వైద్య కళాశాలలను నిర్మించేందుకు ఈ బడ్జెట్లో వెసులుబట్టు కల్పించారు. క్యాన్సర్ బాధితులు దేశంలో పెరుగుతున్న దాన్ని గుర్తించి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఈ బడ్జెట్లో అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఏదైనా ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్టుగా ప్రకటించాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయని,ఆ ప్రాజెక్టుపై ఎటువంటి కోర్టు కేసులు ఉండకూడదు.పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్న విషయం కాంగ్రెస్ నేతలకు తెలవదా అని ప్రశ్నించారు. డి.పి.ఆర్ లేకపోవడం కేంద్ర ప్రాజెక్టుగా పాలమూరు-రంగా రెడ్డి ని పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.
పేద వర్గాల పిల్లల పెళ్లిళ్లు చేసుకుంటే తులం బంగారం తో పాటు లక్ష రూపాయలు నగదు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు మాసం బంగారం కుడా ఇచ్చిన దాఖలాలు లేవని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గ్రామాలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న పథకాలను ప్రజలు అడుగుతున్నారని భయంతో కొత్త నాటకానికి తెర తీస్తున్నారని విమర్శించారు. ఈ కార్య్రమంలో బిజెపి సినియర్ నాయకులు కృష్ణవర్ధన్ రెడ్డి, క్రిస్టియన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, పాండురంగారెడ్డి, అచ్చు గట్ల అంజయ్య, పద్మవేణి, నిరంజన్ అమ్మ, కె .సతీష్ కుమార్ ,ఎడ్ల కృష్ణయ్య, యాదయ్య, సుబ్రహ్మణ్యం, నాగరాజు యాదవ్, కరుణాకర్ రెడ్డి,వీరన్న,బుద్దన్న, నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.