09-12-2024 12:50:11 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ప్రొటోకాల్ ఉల్లంఘనపై తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. సభలో బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ... నేను శాసన సభ్యుడినా కాదా..? నేను అసెంబ్లీలో మాట్లడకూడదా..?, మంత్రులంటే మాకు అభిమానం.. అలానే తమ మీద కూడా అభిమానం ఉండాలి కదా? అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో శాసనసభలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుంది. సభ తర్వాత బీజేపీ సభ్యులు, మంత్రిని పిలిచి మాట్లాడుతానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సభను అమర్యాదపరిచేలా మాట్లాడవద్దని స్పీకర్ వారించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపైనే ఇవాళ్టి సభ నడుస్తుందని వెల్లడించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై అధికార పక్షం సూచనలు ఇచ్చిందని తెలిపారు. న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అటు తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల గురించి శాసనసభలో ఎండగట్టేందుకు శీతాకాల సమావేశాలకు బిజెపి ఎమ్మెల్యేలు ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వెళ్లారు.