calender_icon.png 30 October, 2024 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'ఏక్ పెడ్ మాకే నామ్' కార్యక్రమంలో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

06-07-2024 01:08:30 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని బస్టాండ్ ఆవరణ లో మంథని బీజేపీ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలన్న, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాలన్న మనం పిలుస్తున్న గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచాలన్న సకాలంలో వర్షాలు కురియాలన్నా చెట్లే మనకు ఆధారమని అవి లేకుంటే మనిషి మనుగడే లేదన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్కను నాటాలని సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, పట్టణ కన్వీనర్ సామల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ నాంపల్లి రమేష్, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్, చిలువేరి సతీష్, బొల్లంపల్లి లక్ష్మణ్, దాసరి శ్రవణ్, ఎడ్ల సాగర్, దూడపాక రోజా, గుర్రాల రాజు తదితరలు పాల్గొన్నారు.