calender_icon.png 22 February, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నాయకులు

18-02-2025 12:35:34 AM

బిచ్కుంద, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సోమవారం కరీం నగర్ లో జరిగిన సమావేశానికి జుక్కల్ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల బీజేపీ అధ్యక్షులు వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నట్లు బిచ్కుంద బీజేపీ మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు తెలిపారు.