calender_icon.png 2 March, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను పరిశీలించిన బిజెపి నాయకులు

01-03-2025 06:28:49 PM

మంచిర్యాల (విజయక్రాంతి): శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి కొనసాగుతున్న సహాయక చర్యలను బీజేపీ నాయకులు శనివారం పరిశీలించారు. శాసనసభ పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లిలు టన్నెల్ వద్దకు వెళ్ళి కార్మికులను వెలికి తీయడానికి చేపడతున్న సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న మంచిర్యాల జిల్లా సింగరేణి కార్మికులను రఘునాథ్ ప్రత్యేకంగా అభినందించారు.