calender_icon.png 19 April, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన బీజేపీ నాయకులు

19-04-2025 05:50:43 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు(MP Madhavaneni Raghunandan Rao) ఆదేశాల మేరకు చేగుంట మండలంలోని చందాయిపేట గ్రామానికి చెందిన పురుషోత్తం అనసూయకు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ 19,500 రూపాయల చెక్కును అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎంఆర్ఎఫ్ చెక్కు పేదలకు గొప్ప వరం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ కమిటీ అధ్యక్షుడు జూకంటి శోభన్, బిజెపి మెదక్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బోనాల జ్యోతి, సీనియర్ నాయకులు దొబ్బల మధు, ఆనందాసు ఆంజనేయులు, పేగుడ ముత్యాలు, తోటగొల్ల మధు, బుర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.