calender_icon.png 28 November, 2024 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన బీజేపీ నాయకులు

28-11-2024 05:46:19 PM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చొరవతో బాధిత కుటుంబాలకు గురువారం చేగుంట మండల బీజేపీ నాయకులు అందజేశారు.  బాధితులు రుక్మాపూర్ మ్యాకల నర్సింలు రూ.84,000, చేగుంట గంగవరం దుర్గాప్రసాద్ రూ.48,000, చేగుంట మురాడి స్వామి రూ.60,000, బోనాల కొండాపూర్ దుంపలపల్లి బాలు రూ.49,500, బోనాల బ్యాగరి శంకర్ రూ.33,000, మక్కరాజ్పేట కావేటి అనాజీపూర్ సిద్దయ్య రూ.34,500, పెద్దశివునూర్ అరిగే సత్తయ్య 19,500, గొల్లపల్లి వీరపట్నం శివయ్య రూ.13,000 వీరికి ఇవాళ చెక్కుల అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు చింతల భూపాల్,రాష్ట్ర బిజెపి పార్టీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్ రవికుమార్,మండల ఉపాధ్యక్షుడు సాయిబాబా,మండల బీజేఎైయం అధ్యక్షుడు ర్యాపాకుల శేఖర్ గౌడ్,విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు కాశి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.