16-04-2025 01:53:32 AM
బీజేపీ కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్
హనుమకొండ, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్ర పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకులు స్వచ్ భారత్ అభియాన్ లో భాగంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. హసన్ పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చెరువు కట్ట శుభ్రత కార్యక్రమం, ప్రజలందరిలో స్వచ్చతపై అవగాహన కలిగించేలా ఉండాలని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై, స్వయంగా చెరువుగట్ట శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండీ, భౌతికంగా యాత్రికుడిగా కార్పొరేటర్ చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచింది.
తదనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది మానవుని ప్రాధమిక బాధ్యత. ప్రభుత్వంపై ఆధారపడకుండా మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచాలి. చెరువులు మన సంస్కృతి భాగాలు, వాటిని రక్షించడం మన బాధ్యత అని తెలియజేశారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మారేపల్లి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, రైల్వే బోర్డు సభ్యులు మేకల హరిశంకర్, దాసరి రాజు, తాళ్ల శ్యామ్, సీనియర్ నాయకులు చేకిలం రాజేశ్వరరావు, దాది మధుసూదన్, గంట సత్యం, డివిజన్ ప్రధాన కార్యదర్శి మట్టెడ సుమన్, మారం కుమారస్వామి, కోసనం సతీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.