04-03-2025 05:12:04 PM
చెన్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య(BJP Candidate Malka Komuraiah) విజయం సాధించిన సందర్భంగా కోటపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు మంగళవారం సంబరాలు జరిపారు. టీచర్స్ (గురువుల)కు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. టపాసులు కాల్చి, స్వీట్స్ పంచిపెట్టారు. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెల్లి గురువులకు బొట్టు పెట్టీ స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, మండల ఇంచార్జి కాశెట్టి నాగేశ్వర్ రావు, మండల జెనరల్ సెక్రటరీ కందుల వెంకటేష్, బూత్ అధ్యక్షులు రాళ్లబండి శ్యామ్ సుందర్, సినియర్ నాయకుడు శేగం చంద్రయ్య, రాపనపెల్లి భూత్ అధ్యక్షులు అరె మల్లయ్య, సుంకరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.