06-03-2025 08:41:10 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు సాయి కిరణ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ... పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు రాష్ట్రంలో మోదీ అభివృద్ధికి పట్టం కట్టారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో దింపి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు అందరితో కలిసి పనిచేస్తామని అన్నారు. ఈ సంబరాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.