హైదరాబాద్,(విజయక్రాంతి): మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేసేందుకు 20 బస్తీల్లో 20 మంది బీజేపీ నేతలు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్ పేటలోని తులసీ రాంనగర్ కు చేరుకున్నారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలసుకున్న కేంద్రమంత్రి మూసీపై బీజేపీ నాలుగు నెలలుగా పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికే బాధితులతో తాము ధర్నా నిర్వహించామని, ఇవాళ మూసీ బాధితులతోనే కలిసి నిద్రంచేదుకు అక్కడి వచ్చినట్లు వచ్చామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలతో ఇక్కడి మూసీ పరివాహక ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని, ఎప్పుడు తమ ఇల్లు కూలగొడతారోనన్న భయంలో బతుకుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే బీజేపీ నేతలు అనేక బస్తీల్లో ఈ రాత్రి బస చేసి బాధితుల బాధ్యత బీజేపీ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.