calender_icon.png 2 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సియూ భూములపై రగడ.. బీజేపీ నేతల అరెస్ట్‌

01-04-2025 11:52:12 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): హెచ్‌సియూ భూములను పరిశీలించేందుకు బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌సియూ భూముల వద్ద వాస్తవ పరిస్థితులను  బీజేపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవలనుకున్నారు. కానీ హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసుల మోహరించి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డగించి అరెస్ట్ చేశారు. హెచ్‌సియూ సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. హెచ్‌సియూ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తుందని ఆరోపణలు చేస్తూ అడవి నరికివేత చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కేబీఆర్ పార్కు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కోనసాగించారు. ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది, హెచ్‌సియూ అడవి నరికితే.. హైదాబాద్ ఊపిరి ఆగుతుందంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. బీఆర్ఎస్వీకి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు, ప్రకృతి ప్రేమికులు మద్దతు తెలిపారు.