calender_icon.png 28 November, 2024 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభ్యత్వ నమోదుపై బీజేపీ నేతల తర్జన భర్జన

27-09-2024 01:49:06 AM

రేపు రాష్ట్రానికి పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా రాక

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో సభ్యత్వ నమో దుపై బీజేపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. పార్టీ 25 లక్షల సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా నిర్ధేశించగా ఇప్పటివరకు 8 లక్షల సభ్యత్వాలు మా త్రమే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే గురువారం బీజేపీ ఎంపీలు డా. కే లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఎల్పీనే త ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, తదితరులు సమావేశమయ్యారు. సభ్య త్వాలకు ఊపు తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

రాష్ట్రంలో సభ్యత్వ నమోదుపై పార్టీ అధినాయకత్వం ఎంతో నమ్మకం పెట్టుకుందని ఆ మేరకు నేతలంతా కష్టపడి లక్ష్యాన్ని చేరుకునాలని నేతలు నిర్ణయించారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదుపై సమీక్షించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 28న హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. బేగంపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు,పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు.