06-04-2025 05:40:39 PM
బైంసా (విజయక్రాంతి): శ్రీ రామ నవమి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట ఆలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్మల్ జిల్లా హిందూ వాహిని-భజరంగ్ దల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ డివిజన్ ఏఎస్పీ రాజేష్ మీనన్, హిందూ వాహిని ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి, ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షులు యోగేష్ ప్రభు, జాదవ్ విఠల్, హిందూ సంఘాల ప్రముఖులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.