18-03-2025 12:24:10 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం కొనసాగుతున్నాయి. బీజేవైఎం(Bharatiya Janata Yuva Morcha) కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి( Alleti Maheshwar Reddy arrested)ని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని(Central University land auction) నిరసిస్తూ బీజేవైఎం ఆందోళనకు దిగింది. సెంట్రల్ వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమి వేలాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి.