కరీంనగర్, అక్టోబరు 5 (విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కోడెలు బుధవారం మూడు, గురువారం మూడు మృతిచెందడంతో బీజేపీ ఆధ్వర్య ంలో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలాగానే కాంగ్రెస్ కూడా దేవాలయం విషయంలో అనేకరకమైన హామీలు ఇస్తుందే తప్ప నెరవేర్చడం లేదన్నారు.
పూర్తిస్థాయి వెటర్నరీ డాక్టర్, సిబ్బంది లేకపోవడం, సరైన దాణా లేకపోవడం, నిర్వహణ లోపంతో కోడెలు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. పది రోజుల్లోగా అన్ని ఏర్పాట్లు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రేగుల సంతోష్‌బాబు, నాయకులు ఎన్నింటి హనుమాండ్లు, అక్కపెల్లి వివేక్‌రెడ్డి, రేగుల రాజ్‌కుమార్, నామాల శేఖర్, మెరుగు లక్ష్మణ్, కోరెపు నరేష్, మామిళ్ల లక్ష్మిరాజం, సగ్గు రాజం, సగ్గు రాహుల్, రేగుల శ్రీకాంత్, మైలారం శ్రీనివాస్, అన్నం నరసయ్య, నాగుల మోక్షిత్ పాల్గొన్నారు.