calender_icon.png 21 April, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే బలమైన పార్టీగా బీజేపీ

07-04-2025 12:00:00 AM

  1. ఆవిర్భావంతోనే దేశ రాజకీయాల్లో పెను మార్పు...
  2. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు 

ఆదిలాబాద్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): ప్రస్తుత దేశ రాజకీయాల్లో బీజేపీ ఓ బలమైన పార్టీగా ఎదిగిందని, బీజేపీ ఆవిర్భవిం చాకే దేశ రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతున్నాయని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేసారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పార్టీ కార్యాల యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.

ముందు గా భరతమాత, శ్యాంప్రసాద్ ముఖర్జీ, తదితరుల చిత్రపటాలకు పూజలు చేయాగ, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వం గత 10ఏళ్లుగా అన్ని వర్గాలను కలుపుకొని వెళుతూ దేశం సమగ్రత, అభివృద్ధికి పాటుపడుతోందన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో అత్యధికంగా సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ దేశ సమగ్రతకై పాటుపడుతోందన్నారు.  కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రవీణ్, వేద వ్యాస్, మహేందర్, లాలా మున్నా, జోగు రవి, రాజు, ధోని జ్యోతి, సంతోష్, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.