11-02-2025 01:42:26 AM
* రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్
అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 10: మణిపూర్ హింసకు బీజేపే కారణమని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే సచిన్ పైల ట్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామంలో వీర్ గుర్జర్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవ్ నారాయణస్వామి మందిరం నిర్మించారు.
సోమ వారం ఈ మందిర ప్రారంభోత్సవంలో సచి న్ పైలట్ పాల్గొని మాట్లాడారు. మణిపూర్ హింసకు బీజేపీ, ప్రధాని మోదీ కారణమన్నారు. మోదీకి అధికార దాహం తప్ప ప్రజల గోస పట్టడం లేదని ఎద్దేవా చేశారు. మణిపూర్ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ సందర్శించి బాధితులకు అండగా నిలిచి శాంతి భద్రత చర్యలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్, ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్‌రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుర్ర మ హేందర్‌గౌడ్, ఎండీ గౌస్ పాషా, పండుగుల రాజు, పసుల రాజేందర్, వీర్ గుర్జర్ పాల్గొన్నారు