calender_icon.png 2 April, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీనే అసలు పరాన్నజీవి: కాంగ్రెస్

05-07-2024 01:45:35 AM

న్యూఢిల్లీ, జూలై 4: కాంగ్రెస్ చిన్నచిన్న పార్టీలపై ఆధారపడి బతుకుతున్నదన్న ప్రధా ని మోదీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. అసలైన పరాన్నజీవి బీజేపీయేనని కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ విమర్శించారు. మిత్రపక్షాల ఓట్లతో కాంగ్రెస్ బతుకుతున్నదని మోదీ ఆరోపించారు. దీనికి జైరాంరమేశ్ కౌంటర్ ఇచ్చారు. ‘పరాన్ని జీవి మాత్రమే పరాన్ని జీవి అనే పదాన్ని ఇతరుల పట్ల వాడుతుందని, ప్రాంతీయ పార్టీలను తినేయటంలో బీజేపీ రికార్డును ఒకసారి పరిశీలించాలన్నారు.

అంతరిక్షం వెళ్లే ముందు మణిపూర్ వెళ్లండి 

గగన్‌యాన్ ద్వారా మోదీని 2025లో అంతరిక్షానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తు న్నట్లు ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ చేసిన ప్రకట నపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. మోదీజీ మీరు అంతరిక్షానికి వెళ్లే ముందు మణిపూర్ వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకోండని సూచించారు.