12-04-2025 05:30:21 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడికృష్ణా రెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): దేశహితం కోసం పుట్టిన ఏకైక పార్టీ బిజెపి పార్టీ అని జిల్లా అధ్యక్షుడు గంగాడికృష్ణారెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ గావ్ చలో, బస్తి చలో కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో శనివారం పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో పట్టణంలోని నర్సింగాపూర్ గ్రామంలో గావ్ చలో, బస్తీ చేలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బిజెపిని అడుగుపెట్టనీయమని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బిజెపిని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వాళ్ళ కంటే బిజెపి ప్రమాదమని వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టారు.
దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి గొప్ప వాళ్ళుగా కనిపించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించిన బ్రిటిష్ వాళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి మమకారం ఎక్కువై వారిని కీర్తించే విధంగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిజెపి పై హేలనగా మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పి కెసిఆర్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేశారన్నారు. బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. 16 నెలల్లో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకు విసుగు వచ్చిందని, భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడుగుపెట్టినయోద్దని కృత నిశ్చయానికి ప్రజలు వచ్చారన్నారు.
రేవంత్ రెడ్డి ప్రజా పాలన అని చెప్పుకుంటూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. బిజెపి తెలంగాణలోనీ ప్రతి గడప గడపకు చేరుకొని ప్రజల గుండెల్లో నిలిచిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏకాత్మత మానవతావాదం, అంత్యోదయ భావనతో ప్రేరణ పొందిన బిజెపి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లోని సంకీర్ణ ప్రభుత్వాలతో కలిసి అంత్యోదయ మార్గంలో నిరంతరం ముందు కొనసాగుతుందన్నారు. చిట్ట చివరి పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా అంత్యోదయ విధానంతో ఏకత్మత మానవతావాదం ఆచరణగా, జాతీయ వాదమే సిద్ధాంతంగా కొనసాగుతున్న ఏకైక పార్టీ బిజెపియే అన్నారు. 44 ఏళ్ల కటోర శ్రమ , పోరాటం త్యాగాలతో పార్టీ స్థాయికి ఎదిగిందని, ఈ స్థాయికి పార్టీని తీసుకురావడానికి ఎంతోమంది మహానుభావులు విశేష కృషి చేశారని, వారు పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ధ్యేయంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వ పాలనపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎంతో విశ్వాసం ఉందని, అందుకే వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు, ఆరు రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షాలతో కలిపి (ఎన్ డి ఏ) ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జ్ యాళ్ల సంజీవరెడ్డి మాజీ కౌన్సిలర్ పైళ్ల వెంకట్ రెడ్డి ఇప్పల నర్సింగాపూర్ 61, 62, 63 బూత్ అధ్యక్షులు పల్లె వీరయ్య, యాళ్ల లీల, బొడ్డు మహేష్, కార్యక్రమం కోఆర్డినేటర్లు గంగిశెట్టి ప్రభాకర్ పోతుల సంజీవ్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పడారి కొమురయ్య, సబ్బని రమేష్, యాంసాని శశిధర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.